మీ పిల్లలు ఎక్కువగా రీల్స్ చూస్తున్నారా.. ఇలా మాన్పించండి
ప్రజెంట్ పిల్లలు ఫోన్స్‌కి ఎక్కువగా అడిక్ట్ అయ్యారు. ఇందులో ఎక్కువగా రీల్స్ చూస్తుంటారు. దీంతో చదువు, ఆటలు ఉండడం లేదు.. పిల్లల విలువైన సమయాన్ని మాయం చేస్తున్న ఈ రీల్స్ చక్రం నుంచి పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలో తెలుసుకోండి
సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా అన్నీ అరచేతిలో ఉండేసరికి ఫోన్స్ పట్టుకుని ఆ లోకంలోనే మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే పిల్లలు కూడా ఫోన్స్‌కి అడిక్ట్ అయిపోయారు. ఇందులోనూ ఒక్క నిమిషంలో చూసే రీల్స్ అంటే వారికి చాలా ఇష్టం. పెద్దవారు బిజీగా ఉండి పిల్లల అల్లరి నుంచి కాస్తా రిలాక్స్ అయ్యేందుకు వారికి ఫోన్స్ ఇవ్వడం. దీంతో వారు రీల్స్‌కి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. దీంతో వారి స్క్రీన్ టైమ్‌ని మనమే చేజేతులారా పెంచుతున్నాం. మరి ఈ అడిక్షన్‌ని దూరం చేసేందుకు ఏమేం చేయొచ్చో తెలుసుకోండి.
మీ పిల్లలు ఎక్కువగా రీల్స్ చూస్తున్నారా.. ఇలా మాన్పించండ
బయటికి వెళ్ళి ఆడుకునేలా..
ఎంత సేపు ఇంట్లోనే ఫోన్స్ చూడడం, గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం లాంటివి పిల్లలు చేయకుండా వారు రోజులో కాసేపైనా బయటికి వెళ్ళి ఆడుకునేలా చూడండి. చుట్టూ ఉండే పిల్లలతో కలసిపోయేలా చూడండి. క్రికెట్, ఫిజికల్ యాక్టివ్ గేమ్స్ ఆడితే వారి శరీరానికి చాలా మంచిది. మెంటల్‌గా స్ట్రెస్ అవ్వరు.
అర్థమయ్యేలా చెప్పడం..
అదే విధంగా, రీల్స్, షార్ట్స్ చూడడం, సోషల్ మీడియా ఎక్కువగా వాడడం వల్ల సమస్యలొస్తాయని మీ పిల్లలకి చెప్పాలి. ఈ విషయంలో మీరు కాస్తా మొండిగా ఉండాలి. దీని వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పాలి. రోజులో కొంత టైమ్ మాత్రమే మీరు సెట్ చేయండి. రోజంతా అరగంట, గంట మాత్రమే రీల్స్ చూసేందుకు పర్మిషన్ ఇవ్వండి.
మిగతా వాటిపై ఇంట్రెస్ట్ పెరిగేలా..
ఫోన్స్ నుంచి పిల్లల్ని దూరం చేసేందుకు ఇతర పనులతో బిజీ అయ్యేలా చూడండి. అంటే పేయిటింగ్ వేయడం, మ్యూజిక్ నేర్చుకోవడం, డ్యాన్స్ వంటివి ప్రాక్టీస్ చేయించండి. దీని వల్ల వారు అందులో మునిగి ఫోన్ అడిక్షన్‌కి దూరమవుతారు.
రాత్రులు అసలే వద్దు..
పిల్లలు రాత్రి సమయంలో ఎక్కువగా షార్ట్స్ చూస్తారు. దీని వల్ల వారికి నిద్ర రాదు. ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం రాత్రుళ్ళు అసలు వారికి ఫోన్స్ ఇవ్వొద్దు. దీంతో వారి స్క్రీన్ టైమ్ తగ్గుతుంది.
స్క్రీన్ టైమ్ యాప్స్..
పిల్లలు ఎంతసేపు రీల్స్, షార్ట్స్ చూస్తున్నారనే విషయంపై నిఘా ఉంచండి. దీనికోసం మీరు కొన్ని స్క్రీన్ టైమ్ మానిటరింగ్ సాయం తీసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైమ్ తీసుకున్నప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. దీంతో మీరు అలర్ట్ అవ్వొచ్చు.
No comments:
Post a Comment