యాలుకలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు యాలకులను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి పూత సమస్యను తగ్గిస్తాయి. పురుషులలో స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. యాలుకలు లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు విపరీతంగా బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి రోజు ఖాళీ కడుపుతో యాలుకలను తీసుకోవడం ప్రయోజనం కలుగుతుంది. బరువును తగ్గించడంలో యాలుకలు బాగా పనిచేస్తాయి..
క్యాన్సర్, అంటు వ్యాధుల నివారణకు యాలుకలు యాలుకలు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. గ్యాస్ , జీర్ణ సంబంధిత సమస్యతో బాధ పడుతుంటే ఒక యాలుక తిని కాస్త గోరు వెచ్చని నీటిని తాగితే జీర్ణ సమస్య తగ్గుతుంది. యాలకులలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల అనియంత్రిత పెరుగుదలను నిరోధిస్తాయి. క్యాన్సర్ బారి నుండి రక్షణ కల్పిస్తాయి. బ్యాక్టీరియా, ఫంగస్ నుండి రక్షించే అనేక మూలకాలు యాలుకలలో ఉన్నాయి.ఇవి అనేక అంటు వ్యాధుల నుండి కాపాడతాయి. శారీరక బలానికి, ఎముకల పటుత్వానికి యాలుకలు యాలుకలు తీసుకోవడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. యాలుకలలో క్యాల్షియం మెండుగా ఉండటం వలన ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. యాలుకలు రోజూ తింటే శరీరానికి బలం చేకూరుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు శారీరక బలం పెంచుతాయి. స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే వీరిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
కొలెస్ట్రాల్, బీపీ సమస్యకు చెక్ యాలుకలను రోజూ తినటం వలన కొలెస్ట్రాల్ సమస్య, బీపీ సమస్య తగ్గుతుంది. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు మరియు దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం యాలకులలో లభించే పోషకాలు దగ్గు సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.
గుండె ఆరోగ్యానికి యాలుకలు గుండె ఆరోగ్యానికి కూడా యాలుకలు ఎంతో మేలు చేస్తాయి. ఇలా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే యాలకులను నిత్యం మనంతీసుకోవడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మన ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు.
No comments:
Post a Comment